మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో వాయులింగం ఎందుకు ప్రత్యేకంగా ఉందో మీకు తెలుసా? కారణం ఇదే!

టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు(Manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa). ఈ కథను ఆధునిక పాన్‌ఇండియా చిత్రంగా తెరకెక్కించి, ఓ భారీ విజువల్ ట్రీట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మంచు విష్ణు. మోహన్ బాబు(Mohan Babu) కలను నిజం చేస్తూ, ఎన్నో కష్టాల తర్వాత ‘కన్నప్ప’ చిత్రాన్ని పూర్తిచేసిన విష్ణు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ సినిమాలో కన్నప్పగా విష్ణు(Vishnu Manchu) నటించగా, శివుడి అవతారమైన రుద్ర పాత్రలో ప్రభాస్(Prabhas) ప్రత్యేక పాత్రలో మెరిశారు. అయితే ఈ సినిమాలో ప్రధానంగా నిలిచిన అంశం ఏంటంటే.. శ్రీకాళహస్తి శివలింగం. చాలా మందికి ఈ శివలింగం ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో చూపించిన శివలింగ రూపాన్ని పాత భక్త కన్నప్ప సినిమాలోని లింగ రూపంతో పోల్చి చూస్తే అందరికి ఒకటే డౌట్.. ఏంటి శివలింగం ఇలా ఉంది అని. అయితే, మంచు విష్ణు తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన శివలింగ రూపం వెనుక ఓ లోతైన ఆధారముంది. రీసెర్చ్‌ ఆధారంగా, ప్రామాణిక స్థలపురాణాలను పరిశీలించి, ఆ పరంగా లింగ రూపాన్ని తెరకెక్కించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

మిగతా శివలింగాలకు ఈ వాయులింగానికి ఎందుకు ఈ రూపంలో వ్యత్యాసం అంటే అసలు వాయులింగం(Vayu Lingam) గొప్పతనం ఏంటి అంటే.. వాయులింగం అనేది పంచభూతలింగాలలో నాలుగవది. శివుడు వాయుదేవుడికి వరంగా ఈ స్థలాన్ని ప్రసాదించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. వాయువుకు ఆకారం ఉండదు, ఎటు అయినా ప్రవహించగలదు, ఏ పరిమితులు ఉండవు. అందుకే, శ్రీకాళహస్తిలోని వాయులింగం సాంప్రదాయ శివలింగాలకన్నా భిన్నంగా ఉంటుంది – అది నిలువుగా ఉంటుంది. ఇది ప్రాణశక్తి పైకి ఎగసే తత్వానికి సూచన.

ఈ గర్భగుడిలోని విశేషం ఏంటంటే – లింగం కుడివైపున రెండు దీపాలు ఎప్పుడూ చలించుతూ ఉంటాయని చెబుతారు. ఇది వాయు తత్వానికి మరో గుర్తు. ఇంకా విశేషంగా చెప్పాలంటే.. ఈ స్థలంలో శివుడిని పూజిస్తూ ప్రాణాలు విడిచిన ఏనుగు, పాము, సాలీడు పూజలకు అర్హులయ్యారు. వారిని గౌరవిస్తూ విగ్రహం కిందభాగంలో ఏనుగు దంతాలు, మధ్యలో పాము, వెనుక భాగంలో సాలీడు గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయని కథనాలు ఉన్నాయి.

అంతేకాక, ఈ వాయులింగం స్వయంభూ.. అంటే శివుడు స్వయంగా ఇక్కడే వెలిశారు. అలాగే ఈ విగ్రహాన్ని ఎవరు చేతితో తాకకూడదు. పూజారులు కూడా లింగాన్ని తాకకుండా పూజలు చేస్తారు. శివుడికి ప్రీతికరమైన అభిషేకాలు కూడా ఈ విగ్రహానికి చేయకుండా, కేవలం పీఠానికి మాత్రమే పూజలు చేస్తారు. ఎందుకంటే వాయువుని ఎవరు తాకలేరు అనే నియమం ఎక్కడ ఉంది. ఈ క్షేత్రం యొక్క స్థలపురాణాల ప్రకారం బ్రహ్మకి జ్ఞానం ప్రసాదించిన ప్రాంతం ఇదే. మూడవ శతాబ్దం నుంచే ఈ కాళహస్తి క్షేత్ర ప్రస్తావనలు తమిళ చారిత్రక గ్రంథాల్లో కనిపిస్తున్నాయి.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *