మహేశ్ బాబు OR ప్రభాస్.. కరీనా ఛాయిస్ ఎవరు?  

Mana Enadu: బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్(Kareena Kapoor Khan) గురించి తెలియని వారుండరు. వర్సటైల్ యాక్టింగ్తో.. మెస్మరైజ్ చేసే అందంతో ఈ భామ గత పాతికేళ్లుగా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తాజాగా సినీ పరిశ్రమలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ భామ. రణ్ధీర్ కపూర్ తనయగా, కరీష్మా కపూర్ చెల్లెలిగా, కపూర్ కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఈ భామ డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ తనలోని నటిని మెరుగుపరుచుకుంటూ సత్తా చాటింది. ఇక ఇద్దరు పిల్లల తల్లి అయిన కరీనా తన సెకండ్ ఇన్నింగ్స్లోనూ దూసుకెళ్తోంది.

మహేశ్ Or ప్రభాస్

కెరీర్ స్టార్టింగ్ నుంచి సౌత్ సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనుకుంది కరీనా కపూర్. కానీ బీటౌన్లోనే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇక తాజాగా ఈ భామ సౌత్లో ఓ పెద్ద ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కేజీయఫ్ యశ్తో టాక్సిక్లో నటిస్తున్నట్లు వార్తలొచ్చినా ఆ సినిమాలో వేరే హీరోయిన్ కన్ఫామ్ అయింది. ఇక తాజాగా కరీనా కపూర్లో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో భాగమైందంటూ బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. అయితే అది మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి (SSMB 29) మూవీనా లేక, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్‌’ (Prabhas Spirit) సినిమానో తెలియరాలేదు. ఈ రెండింట్లో ఒక దానికి ఆమె ఓకే చెప్పినట్లు టాక్.

గరుడలో కరీనా

మహేశ్‌బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి ( SS Rajamouli) దర్శకత్వంలో అడ్వెంచర్‌ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్పైకి రానున్న ఈ మూవీకి ‘గరుడ’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ మూవీలో మహేశ్ సరసన కరీనాకపూర్‌ నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. జక్కన్న డైరెక్షన్, సూపర్ స్టార్ హీరో కావడంతో ఆమె ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

స్పిరిట్ లో బీ టౌన్ కపుల్

మరోవైపు ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న సినిమా ‘స్పిరిట్‌’ (Spirit). రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్‌ తొలిసారి పోలీస్‌ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. 2026లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా కరీనా కపూర్ నటించనుండగా.. డార్లింగ్ను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఆమె భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ రెండింట్లో కరీనా దేనికి ఓకే చేశారో చిత్రబృందాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *