కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) డెబ్యూ మూవీ ‘యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu)’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ద్వారా కార్తీ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తమిళంలో సాధారణంగా ఆడిన ఈ సినిమా తెలుగులో మాత్రం సూపర్ హిట్ అయింది. ఇందులో కార్తీ చెప్పిన ‘రేయ్.. ఎవర్రా మీరంతా’ అనే డైలాగ్ ఇప్పటికీ మీమ్స్ లో వాడుతుంటారంటే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏంటో తెలుసుకోవచ్చు.
యుగానికి ఒక్కడు రీ రిలీజ్
ఇక కార్తీ (Karthi Movies) కూడా ఈ సినిమా తన సొంత రాష్ట్రం తమిళనాడులో సరిగ్గా ఆడలేదని.. కానీ తాను పక్క రాష్ట్రం వాడినైనా తెలుగు ప్రేక్షకులు తన మొదటి సినిమాను విపరీతంగా ఆదరించారని గతంలో ఓ సినిమా ఈవెంట్ లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అందుకే తనకు కోలీవుడ్ కంటే టాలీవుడ్ ప్రేక్షకులంటే కాస్త ప్రేమ ఎక్కువ అని తెలిపారు. ఇక యుగానికి ఒక్కడు సినిమాకు ఉన్న క్రేజ్ చూసి మేకర్స్ మరోసారి ఆ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు.
Yuganiki okkadu/ Aayirathil Oruvan is one of best films made in Indian!!!
Such a fantastic film
Karthi 🔥🔥🔥 pic.twitter.com/Q7lRgYEBNo— Spiderman with potta (@MosapoyinaKodi) March 14, 2025
థియేటర్లోకి కల్ట్ క్లాసిక్
2010లో రిలీజ్ అయిన యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu Re Release) మూవీ 15 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. సెల్వ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళంలో తెరకెక్కించిన ఆయురత్తిల్ ఒరువన్ సినిమాకు తెలుగు అనువాదమే యుగానికి ఒక్కడు. మూడు విభిన్న కాలాల్లో సాగే ఓ అద్భుత కథతో ఈ చిత్రం సాగుతుంది. డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్ పై ఆర్. రవీంద్రన్ ఈ సినిమాను నిర్మించారు. కార్తీ, రీమా సేన్ (Reema Sen), ఆండ్రియా జెరెమయ్యా ప్రధాన పాత్రల్లో నటించారు.
Yuganiki okkadu >>>>>>>>> Goosebumps every godamn time. https://t.co/TPwrhopv1g pic.twitter.com/FFYKf3pHcH
— Doc_ocK 🐉 (@Sriraj1_1) April 20, 2023
రేయ్ ఎవర్రా మీరంతా?
మరోసారి థియేటర్లలో యుగానికి ఒక్కడ సందడి చేసింది. ఈ కల్ట్ క్లాసిక్ ను మళ్లీ థియేటర్లో ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ సినిమా హాళ్లకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. కార్తీ స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి థియేటర్లన్నీ ఆడియెన్స్ విజిల్స్ తో హోరెత్తాయి. ఇక ఎవర్రా మీరంతా అనే డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం ప్రేక్షకుల సందడితో దద్దరిల్లింది.






