టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఇటీవలే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ భామ హిందీలో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan)తో కలిసి ఓ సినిమా చేస్తోంది. అయితే ఈ మూవీ షూటింగు సమయంలో ఈ జంట ప్రేమలో పడినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. శ్రీలీల.. కార్తీక్ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపించడం.. ఇటీవలే ఆ హీరో తల్లి తనకు కోడలిగా డాక్టర్ అయితే బాగుంటుందని అని చెప్పడంతో ఈ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలకు బలం చేకూరింది.
ఇండస్ట్రీలో నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు
అయితే తాజాగా హీరో కార్తీక్ ఆర్యన్ శ్రీలీలతో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తనకు ఇండస్ట్రీలో గర్ల్‌ఫ్రెండ్ లేదని చెప్పుకొచ్చాడు. దీంతో శ్రీలీల-కార్తీక్ ఆర్యన్ మధ్య ఎలాంటి రిలేషన్ లేదనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ హీరో కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. శ్రీలీల-కార్తీక్ ఆర్యన్ కలిసి అనురాగ్ బసు (Anurag Basu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
రెమ్యునరేషన్ పై కార్తీక్ క్లారిటీ
ఇక ఇదే ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ.. తన సినిమా కోసం రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించాడు. సినిమా ఇండస్ట్రీలో ఇంత రెమ్యునరేషన్ తీసుకునే నటుడిని నేను ఒక్కడినేనా. మిగతా వాళ్ల గురించి ఎందుకు ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే నాకు వెనక సపోర్ట్ ఎవరు లేరు. అందుకే ఇలాంటి కథనాలు రాస్తున్నారు. వీటిని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అని కార్తీక్ ఆర్యన్ చెప్పుకొచ్చారు.






