
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి తదుపరి సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇవాళ (ఏప్రిల్ 8వ తేదీ) ఆయన పుట్టినరోజు సందర్భంగా బన్నీ తన ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా అధికారక అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
అల్లు-అట్లీ అఫీషియల్
సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ (Sun Pictures) రూపొందిస్తున్న ఈ సినిమా గురించి మేకర్స్ తాజా వీడియోలో వివరించారు. హాలీవుడ్ అవతార్ రేంజ్లో ఈ సినిమా ఉండబోతున్నట్లు అనౌన్స్మెంట్ వీడియో చూస్తే అర్థమవుతోంది. పాన్ వరల్డ్ మూవీగా దీన్ని అట్లీ తెరకెక్కించబోతున్నాడు. అల్లు అర్జున్ (AA22), అట్లీ కాంబోలో ఓ పవర్ ఫుల్ స్క్రిప్టుతో అదిరిపోయే వీఎఫ్ఎక్స్ తో ఈ చిత్రం రూపొందబోతున్నట్లు తాజా వీడియో చూస్తే తెలుస్తోంది. పుష్ప-2 (Pushpa 2 : The Rule)తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ.. ఈసారి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యేలా ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
వచ్చే వేసవిలో రిలీజ్
సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం రానున్నట్లు తెలిసింది. ఇందులో అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. సాయి అభయంకర్ (Sai Abhayankar) మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు వీఎఫ్ఎక్స్ డిజైన్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా వివరాలు ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇక ఈ వేసవిలో AA22 షూటింగ్ షురూ కానుంది. వచ్చే ఏడాదిలోనే (2026) ఈ మూవీని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.