Vishwambhara : ‘విశ్వంభర’ ఫస్ట్ సాంగ్ అప్డేట్.. టైం, లొకేషన్ ఇదే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు దాదాపుగా పూర్తయింది. ఇందులో చిరు సరసన త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో వింటేజ్ చిరును చూడబోతున్నారంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు.

Image

12న ఫస్ట్ సాంగ్ రిలీజ్

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. విశ్వంభర (Vishwambhara) మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈనెల 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర నుంచి పాటను విడుదల చేయనున్నారట. కృష్ణ జిల్లా నందిగామలోని పరిటాల ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

చాలా రోజుల తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో విశ్వంభరపై  అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తుండటంతో పక్కా హిట్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక చిరు ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో మరో మూవీ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ఓ యాక్షన్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *