అందాల ముద్దుగుమ్మ శోభా శెట్టి(Shobha Shetty) గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నడ ఇండస్ట్రీలో ప్రయాణం ప్రారంభించిన ఈ భామ, తెలుగులో ‘కార్తీక దీపం’(Karthika Deepam) సీరియల్లో మోనిత అనే నెగటివ్ రోల్లో నటించి బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. విలన్ పాత్ర అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ప్రశంసలు దక్కాయి. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ పాత్రతో వచ్చిన పాపులారిటీతో ఆమె “బిగ్ బాస్ తెలుగు సీజన్ 7″లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఫైనల్‌కు చేరుకోకపోయినా, తన ఆటతీరుతో చాలా మంది అభిమానులను సంపాదించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన గ్లామర్ ఫొటోషూట్లను పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులను షాక్‌కు గురి చేసింది. దీంతో శోభ ఎందుకు సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటుందనే ప్రశ్నలు ఊపందుకున్నాయి.
ఆమె వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదని, ‘కార్తీక దీపం 2’లో అవకాశం వచ్చినా అది చేజారిపోయిందని సమాచారం. అంతేకాకుండా, నిశ్చితార్థం జరిగి సంవత్సరం గడిచినా ఇంకా పెళ్లి జరగకపోవడం ఆమెను మానసికంగా ప్రభావితం చేశాయనే టాక్ వినిపిస్తుంది
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత శోభ గార్మెంట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. అది కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని టాక్. అన్నింటిలోనూ నిరాశ ఎదురవ్వడంతో ఆమె కొంత డిప్రెషన్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె తనకు కొంత విశ్రాంతి అవసరమని భావించి సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటించిందని అర్థమవుతోంది. అయితే, ఈ విషయంపై ఆమె నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం శోభ త్వరగా బలంగా తిరిగి వచ్చి మళ్లీ బుల్లితెరను కప్పిపుచ్చాలని కోరుకుంటున్నారు.






