కార్తిక మాసం ప్రారంభం.. ఈ నెలలో ముఖ్యమైన పండుగలు ఇవే!

ManaEnadu : పరమేశ్వరునికి పరమ పవిత్రమైన కార్తిక మాసం (Karthika Masam) ఇవాళ (నవంబర్ 2, శనివారం) ప్రారంభమైంది. ఈ మాసం డిసెంబర్ 1వ తేదీ(ఆదివారం)తో ముగుస్తుంది. తెల్లవారుజామునే శైవాలయాలకు భక్తులు పోటెత్తి దీపారాధన చేశారు. శివకేశవుల ఆరాధనకు విశిష్టమైన ఈ మాసంలో ఎన్నో జన్మల పాపాలను ప్రక్షాళన చేసి పుణ్యఫలాలు ప్రసాదించే పర్వదినాలు, పుణ్యతిథులు వస్తాయి. మరి అవేంటో తెలుసుకుందామా.. ?

 

నవంబర్ 2 (శనివారం): కార్తిక శుద్ధ పాడ్యమి – బలిపాడ్యమి, గోవర్ధన పూజ

ఈ రోజు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెనవ్రేలు మీద ఎత్తి, గొడుగులా పట్టుకుని గోకులాన్ని రక్షించిన రోజు.

నవంబర్ 5 (మంగళవారం): కార్తిక శుద్ధ చవితి – నాగుల చవితి

దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తిక శుద్ధ చవితి రోజు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతుంటారు.

నవంబర్ 8 (శుక్రవారం): కార్తిక శుద్ధ సప్తమి – కోటి సోమవారం

కార్తీకమాసంలో శుద్ధ సప్తమి, శ్రవణా నక్షత్రం కలిసి వచ్చే రోజును కోటి సోమవారంగా జరుపుకుంటారు.

నవంబర్ 15 (శుక్రవారం): కార్తిక శుద్ధ పూర్ణిమ – కార్తిక పౌర్ణమి, జ్వాలాతోరణం, గురునానక్ జయంతి

కార్తిక పౌర్ణమి రోజున శివకేశవుల ఆలయాల్లో జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు. మరోవైపు అరుణాచలంలో ఆకాశ దీపోత్సవం, సువర్ణముఖి తీర్థ ముక్కోటి, శ్రీ కపిలేశ్వర స్వామికి అన్నాభిషేకం వంటి ఉత్సవాలు జరుగుతాయి.

డిసెంబర్ 01 (ఆదివారం): కార్తిక బహుళ అమావాస్య

డిసెంబర్ 1వ తేదీన కార్తిక మాసం ముగుస్తుంది. అమావాస్య ముగిసి పాడ్యమి వస్తుంది కాబట్టి ఈ రోజు పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *