
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన ఇటీవల నటించిన కంగువ(Kanguva), రెట్రో(Retro) బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ తమిళ్ స్టార్. తాజాగా సూర్య తన 45వ చిత్రం ‘కరుప్పు(Karuppu)’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో సూర్య సరసన స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ కమెడియన్, దర్శకుడు RJ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster) అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది.
‘కరుప్పు’లో సూర్యది వైవిధ్యమైన రోల్
ఇదిలా ఉంటే.. తాజాగా, ‘కరుప్పు’కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. జులై 23న సూర్య పుట్టినరోజున మూవీ మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ‘కరుప్పు’ టీజర్(Karuppu Teaser)ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య గతంలో ‘సూరరై పోట్రు’, ‘జై భీమ్’ వంటి చిత్రాలతో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించాడు. ‘కరుప్పు’లో కూడా అతని నటన ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ తెలిపారు. సాయి అభ్యంకర్(Sai Abhyankar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆర్‌జే బాలాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది, త్వరలో మరిన్ని అప్‌డేట్‌లు వస్తాయని చిత్ర బృందం ప్రకటించింది.
The teaser of #Suriya‘s film #Karuppu is going to be released on July 23rd pic.twitter.com/eWFnl8U0Q4
— Movie Tamil (@MovieTamil4) July 17, 2025
సూర్య ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atloori)తో మరో చిత్రంలో నటిస్తున్నాడు. కానీ ‘కరుప్పు’పై అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. టైటిల్(Title), ఫస్ట్ లుక్ ఆధారంగా ఈ చిత్రం సూర్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.