తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై నటి కీర్తి సురేశ్(keerthy suresh) ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది. బిజినెస్ మ్యాన్ ఆంటోనీ తట్టిల్‌తో (Antony Thattil) ప్రేమలో ఉన్నట్లు తెలుపుతూ అతడితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. 15 ఏళ్ల స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుందని వెల్లడించింది. అయితే ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు ఆమె గతంలోనే ఓ హింట్ ఇచ్చింది. ఆంటోనీ పేరులోని చివరి రెండు అక్షరాలు (NY), తన పేరులోని మొదటి రెండు అక్షరాలు (Ke) కలిపి తన పెట్ డాగ్‌కు నైక్ (Nyke) అని పేరు పెట్టుకుంది. కానీ ఈ విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. ఆ పెట్‌ను కూడా అతడే కీర్తికి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం
కీర్తి సురేష్ పెళ్లి మీద, ప్రేమ వార్తల మీద గతంలో రకరకాల కథనాలు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, తమిళ్‌కు చెందిన ఓ కమెడిన్తో పాటు మరికొందరితో ప్రేమాయణం అని కీర్తి సురేశ్ మీద పుకార్లు చక్కర్లు కొట్టాయి. కానీ కీర్తి సురేశ్‌కు సినిమాల్లోకి రాక ముందు నుంచీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతగాడితో ఇన్నేళ్లు ప్రేమలో ఉందని తెలుస్తోంది. ఆంటోనీతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు తనంతట తాను చెప్పే వరకు ఎవ్వరూ పసిగట్టలేకపోయారు.
కీర్తి సురేశ్, ఆంటోనీ కాలేజీ రోజుల నుంచి ఫ్రెండ్స్. ఆంటోనికి దుబాయ్‌తోపాటు భారత్‌తోనూ పలు వ్యాపారాలున్నాయి.
దక్షిణాదిలో పలు సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నకీర్తి సురేశ్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో దళపతి విజయ్, సమంత నటించిన ‘తెరి’ సినిమా(తెలుగులో పోలీసోడు)కు రీమేక్‌గా అట్లీ రూపొందిస్తున్న సినిమా బేబీ జాన్‌లో (baby john) వరుణ్ ధావన్ (varun dhawan) సరసన ఆడిపాడింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.






