విజయ్​ దేవరకొండ మూవీలో సత్యదేవ్​?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ‘VD 12’ వర్కింగ్​ టైటిల్​తో గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. 2025 సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన ఓ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఇటీవలే ‘జీబ్రా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యాక్టర్ సత్యదేవ్​ను (Satyadev) చిత్ర బృందం సంప్రదించిందని, అందుకు అతడు ఓకే చెప్పినట్లు టాక్​ నడుస్తోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్​తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఈ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని తెలిసింది. అతడి రోల్ విజయ్ దేవరకొండకు హెల్ప్ చేస్తూనే వెన్నుపోటు పొడిచేలా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సత్యదేవ్ ఈ సినిమా షూటింగ్‌లో కూడా భాగం అయినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అతడి పాత్రపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.

నటన పరంగా 100 శాతం న్యాయం చేసే సత్యదేవ్.. జీబ్రా (zebra) మూవీతో ఎట్టకేలకు విజయం సొంతం చేసుకున్నారు. సత్యదేవ్​ మొదటి నుంచి హీరోగా నటిస్తునే పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో అదరగొడుతున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్‌లో విలన్‌గా చేసి తనలోని మరో నటుడిని వెలికితీశాడు.

ఈ సినిమా టైటిల్ ఇంకా రివీల్ కాకపోవడంతో మేకర్స్ టైటిల్ టీజర్‌ని విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ టీజర్‌కు వాయిస్​ ఓవర్​ ఇచ్చేందుకు బాలకృషని (Balakrishna) సంప్రదించారట మేకర్స్. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో రౌడీ బాయ్ ప్లస్ గాడ్ ఆఫ్ మాసెస్ కాంబినేషన్‌లో టీజర్ వచ్చే టీజర్​పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి సినిమాలతో ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు అందించిన గౌతమ్ తిన్ననూరి ఈ సారి యాక్షన్ జోనర్​లోకి షిఫ్ట్ అయ్యాడు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ ప‌తాకాల‌పై నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *