Khaleja Re-Release: రీరిలీజ్‌లో ‘ఖలేజా’ హవా.. కలెక్షన్​ ఎంతంటే?

థియేటర్ల వద్ద ‘ఖలేజా’ రీ రిలీజ్​ (Khaleja Rerelease) హంగామా నడుస్తోంది. మహేశ్​ అభిమానులు ఖలేజా రీరిలీజ్​కు క్యూ కట్టారు. దీంతో ఇప్పుడు సోషల్​ మీడియాలో ఎక్కడ చూసినా ఖలేజీ (Khaleja) రీరిలీజ్​, థియేటర్ల వద్ద అభిమానులు రచ్చరచ్చ చేస్తున్న పోస్టులే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీ రిలీజ్​కు కళ్లు చెదిరే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఖలేజాకు ఏకంగా ప్రీమియర్స్

రీ రిలీజ్ ట్రెండ్‌లో మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మురారి, బిజినెస్‌మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాలని రీ రిలీజ్ చేయగా.. అభిమానులు థియేటర్లలో భారీగా సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఖలేజాను కూడా మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈ మూవీకి ఏకంగా ప్రీమియర్స్ కూడా వేశారు. కాగా ‘ఖలేజా’ రీ రిలీజ్‌లో రికార్డ్స్ సృష్టించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మొత్తం రూ.6.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే అసలు నంబర్స్ మాత్రం నిర్మాణ సంస్థ రిలీజ్ చేయలేదు. థియేటర్ల వద్ద ప్రేక్షకుల హడావుడి చూస్తుంటే వసూళ్లు భారీగానే వచ్చాయని అనిపిస్తుంది.

Watch Khaleja Online | 2010 Movie | Yidio

అప్పుడు డిజాస్టర్​.. ఇప్పుడు ఫేవరెట్​

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, అనుష్క (Anushka) నటించిన ‘ఖలేజా’. 2010లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అప్పుడు డిజాస్టర్​గా నిలిచింది. తర్వాత టీవీల్లో వచ్చినప్పుడు మాత్రం ఎగబడి చూశారు. చాలామందికి ఇది ఫేవరెట్ మూవీగా నిలిచింది. దీంతో ఇప్పుడు రీ రిలీజ్ చేయడంతో ఆ మూవీ మీద ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటున్నారు. వచ్చే శుక్రవారం వరకు ఖలేజాను పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *