నరేష్ చిట్టూరి
మన ఈనాడు:
అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు ముందు నాయకులు బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. సీఎం కేసీఆర్ వచ్చి వరాలు కురిపించారు..కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సొంతపార్టీ నేతలకే అసమ్మతి పెరుగుతోంది.
మధిర మండలం నిదానపురం గ్రామ సర్పంచ్ బాదం కృష్ణారెడ్డి, చింతకాని మండలం పందిళ్ళపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎనుకల బ్రహ్మారెడ్డి, బిఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు మేకల సత్యనారాయణ, చల్లా వెంకటేశ్వరరావు, దండ్యాల తిరుపతి ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో మధిర క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి భట్టి విక్రమార్క ఆహ్వానించారు.
Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
–నరేష్ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…