బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అడ్వానీ (Kiara Advani) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కియారా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ (NTR) కాంబోలో వస్తున్న వార్-2 (WAR-2), యశ్ ప్రధాన పాత్రలో వస్తున్న టాక్సిక్ (Toxic) సినిమాల్లో నటిస్తోంది. ఇదే కాకుండా రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్-3 సినిమాలోనూ కియారా నటించనుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నాడు.
డాన్-3 నుంచి కియారా ఔట్
బాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంఛైజీల్లో డాన్ కు సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకు ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన ‘డాన్’ (2006), ‘డాన్ 2’ (2011) సినిమాల్లో షారుక్ ఖాన్ (Shahrukh Khan) హీరోగా నటించారు. ఇప్పుడు వస్తున్న డాన్-3లో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో రణ్ వీర్ (Ranveer Singh)కు జోడీగా కియారా నటించనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ భామ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.
Instagram Post Of Kiara advani and Sid Malhotra Expecting First Baby ❤️
|#KiaraAdvani|#pregnancy|#SidharthMalhotra| pic.twitter.com/iKd9VmOmVB
— Omkar Ugale (@Omkarugale2811) February 28, 2025
కియారా ప్రెగ్నెన్సీ బ్రేక్
2023లో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra)ను పెళ్లాడిన కియారా ఇటీవలే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రెగ్నెన్సీ కారణంగా కియారా డాన్-3 నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇక కియారా ఔట్ కావడంతో మేకర్స్ డాన్-3లో కొత్త హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించారు. ఇక కియారా ప్రస్తుతం తన చేతిలో ఉన్న వార్-2, టాక్సిక్ సినిమా షూటింగులను పూర్తి చేసి ఆ తర్వాత తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయనుంది.






