కొత్తగా ఏంటిది నయన్.. సినిమా పూజా కార్యక్రమంలో లేడీ సూపర్ స్టార్

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ భామ ‘ముక్తి అమ్మన్ 2 (Mookuthi Amman 2)’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో గురువారం రోజున జరిగింది. అయితే ఈ వేడుకలో డైరెక్టర్ సుందర్.సితో పాటు నయనతార, మీనా, ఖుష్బూ, రెజీనా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నయన్ ఏంటిది కొత్తగా

అయితే నయనతార తన సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనరన్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ తాజాగా ముక్తి అమ్మన్-2 సినిమా పూజా కార్యక్రమంలో నయన్ ను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు.  కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఆమె నమస్కరిస్తున్న వీడియోలు షేర్‌ చేస్తున్న నెటిజన్లు.. ‘‘ఆమె నయనతారేనా.. ఇదేంటి కొత్తగా’’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇదేందయ్యా ఇది నయన్ ఏంటిది కొత్తగా అంటూ మాట్లాడుకుంటున్నారు.

సెంటిమెంట్ బ్రేక్ చేసిన నయన్

సుమారు 22 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించిన నయనతార వాటి ప్రమోషన్స్‌కు మాత్రం దూరంగా ఉంటూనే వస్తోంది. కొత్త ప్రాజెక్ట్‌కుపై సంతకం చేసినప్పుడే ప్రమోషన్స్‌కు రాననే విషయాన్ని నిర్మాతలతో క్లియర్ గా చెప్పేస్తుంది నయన్. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించినా.. వాటి ప్రమోషన్స్ లో ఎక్కడా కానరాలేదు ఈ భామ. కానీ తాజాగా జరిగిన సినిమా పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

సీక్వెల్ దర్శకుడిగా సుందర్ సి

నయనతార కథానాయికగా ఆర్జే బాలాజీ ‘ముక్తి అమ్మన్‌’ అనే సినిమాను రూపొందించారు. 2020లో రిలీజ్ అయిన ఈ చిత్రం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులనూ మెప్పించింది. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపించి అలరించారు. దీనికి కొనసాగింపుగా వస్తున్న సినిమాయే ‘ముక్తి అమ్మన్‌ 2’. అయితే ఈ సీక్వెల్ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *