ప్రతి హీరోకు ఒక టైమ్ అనేది ఉంటుందని.. ఏదో ఒక సమయంలో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తాడని కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) అన్నారు. సినిమాలకు బ్రేక్ తీసుకుని కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమవ్వడంపైన ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖఅయలు చేశారు. తాజగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన రిటైర్మెంట్ (Kichcha Sudeep Retirement) ప్లాన్ గురించి షేర్ చేసుకున్నారు. అయితే తాను ఇంకా అలసిపోలేదని అయితే ఏదో సమయంలో తాను నటన నుంచి వైదొలిగే అవకాశం ఉందని అన్నారు.
హీరో బోర్ కొట్టేస్తారు
‘‘ప్రతి హీరో ఏదో ఒక సమయంలో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తాడు. అందరికీ ఒక టైమ్ అనేది ఉంటుంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఒక హీరోగా నేనెప్పుడూ సెట్‌లో ఎవరినీ నా కోసం ఎదురుచూసేలా చేయలేదు. భవిష్యత్తులో సపోర్టింగ్ రోల్‌లో చేస్తే.. ఇంకొకరి కోసం ఎదురుచూస్తూ కూర్చోను. ఇక బ్రదర్, మామయ్య వంటి పాత్రలు చేయడంపై నాకు ఇంట్రెస్ట్ లేదు.
బ్రేక్ తీసుకునే ప్రసక్తి లేదు
నేను ఇటీవల రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్‌లు కథలు నచ్చకపోవడం వల్ల రిజెక్ట్ చేయలేదు. ఈ సమయంలో వాటిని సెలెక్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం కాదని వాటిని అంగీకరంచలేదు. సినిమాలకు బ్రేక్ తీసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యే ప్రసక్తే లేదు. మెయిన్ లీడ్ ఛాన్సులు రాకపోతే డైరెక్షన్, ప్రొడక్షన్ వైపు వెళ్తాను. నేను హీరోగా ఇప్పటివరకు సాధించిన దానికి ఎంతో సంతృప్తిగా ఉంది.” అని కిచ్చా సుదీప్ చెప్పుకొచ్చారు.
28 ఏళ్ల కెరీర్
ఇక 1997లో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి సుదీప్ ఎంట్రీ ఇచ్చారు. 2000లో వచ్చిన ‘స్పర్శ’తో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన 2003లో వచ్చిన ‘కిచ్చా’ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయణ్ను వారు కిచ్చా సుదీప్ అని పిలుచుకుంటున్నారు. 2012లో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ (Eega)’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు సుదీప్. తాజాగా ‘మ్యాక్స్ (Max)’ మూవీతో ప్రేక్షకులను పలకరించారు.







