ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), తమిళ్ స్టార్ నటుడు ధనుష్(Dhanush) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. ఈ చిత్రంలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్(DCP) మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన ‘అనగనగా కథ’ అనే పాట(Song)కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కుబేర’ ప్రమోషన్స్(Promotions)పై శేఖర్ అండ్ కో ఫోకస్ చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది.
ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్ రెస్పాన్స్
తాజాగా కింగ్ నాగార్జున(Nagarjuna) ‘కుబేర’కు తన డబ్బింగ్(Dubbing) పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామోహన్ కలసి మాట్లాడుతున్న ఫొటోలని మేకర్స్ షేర్ చేశారు. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండిస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్-5లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో కుబేర మీద ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్ రావు ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు.
#Kubera‘s Budget : ₹150 Cr “incl. int.”
Ott Rights sold for ₹47 Cr as of now!#Dhanush | #Nagarjuna | #RashmikaMandanna pic.twitter.com/TLGZMxc8Sr
— Super Television Hindi (@super_tv_hindi) June 8, 2025






