టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కింగ్‌డమ్(Kingdom)’. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీలో రుక్మిణీ వసంత్(Rukmini Vasanth), భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నాడు.

మే 30న గ్రాండ్ రిలీజ్
తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేశారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్(First Single Song) సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని మే 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మరికెందుకు ఆలస్యం ‘హృదయం లోపల(Hridayam Lopala)’ అంటూ సాగే పాటను మీరూ చూసేయండి..






