టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘క(KA)’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 2024 దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదలై భారీ విజయం అందుకుంది. చిన్న బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. కిరణ్ సినీ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
‘క’కు అరుదైన గౌరవం
అయితే తాజాగా క సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఓ సంస్థ నిర్వహించే ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke Film Festival)’కు ‘క’ సినిమా నామినేట్ అయ్యింది. ఉత్తమ సినిమా విభాగంలో ఈ మూవీ నామినేట్ అయినట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల ఆఖరులో ఢిల్లీ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో విజేతలకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈ చిత్రబృందానికి నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Ka has been officially selected for the 15th Dada Saheb Phalke Film Festival 2025.
A film that blends powerful storytelling with raw emotion now recognized on one of India’s most prestigious platforms!Watch Ka exclusively on @etvwin and experience the brilliance that earned it… pic.twitter.com/5i4PNAH3e5
— ETV Win (@etvwin) April 25, 2025
మరింత ఉత్కంఠగా ‘క-2’
ఇక క సినిమా సంగతికి వస్తే ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీని నూతన దర్శకులు సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించారు. నయన్ సారిక (Nayan Saarika), తన్వీ రామ్ కథానాయికలుగా కనిపించారు. డాల్‌బీ విజన్: ఆటమ్స్ టెక్నాలజీలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక క సినిమాకు కొనసాగింపుగా ‘క 2 (KA-2)’ ఉంటుందని ఇప్పటికే టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పార్ట్ 1’తో పోలిస్తే.. ‘పార్ట్ 2’ మరింత ఉత్కంఠగా సాగేలా చూస్తామని టీమ్ ఇప్పటికే వెల్లడించింది.






