‘క’ మూవీకి అరుదైన గౌరవం.. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు నామినేట్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘క(KA)’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 2024 దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదలై భారీ విజయం అందుకుంది. చిన్న బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. కిరణ్ సినీ కెరీర్​లో ఇది బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

‘క’కు అరుదైన గౌరవం

అయితే తాజాగా క సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఓ సంస్థ నిర్వహించే ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Dadasaheb Phalke Film Festival)’కు ‘క’ సినిమా నామినేట్‌ అయ్యింది. ఉత్తమ సినిమా విభాగంలో ఈ మూవీ నామినేట్‌ అయినట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల ఆఖరులో ఢిల్లీ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో విజేతలకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈ చిత్రబృందానికి నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత ఉత్కంఠగా ‘క-2’

ఇక క సినిమా సంగతికి వస్తే ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీని నూతన దర్శకులు సుజిత్, సందీప్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. నయన్‌ సారిక (Nayan Saarika), తన్వీ రామ్‌ కథానాయికలుగా కనిపించారు. డాల్‌బీ విజన్‌: ఆటమ్స్‌ టెక్నాలజీలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక క సినిమాకు కొనసాగింపుగా ‘క 2 (KA-2)’ ఉంటుందని ఇప్పటికే టీమ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పార్ట్‌ 1’తో పోలిస్తే.. ‘పార్ట్‌ 2’ మరింత ఉత్కంఠగా సాగేలా చూస్తామని టీమ్‌ ఇప్పటికే వెల్లడించింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *