
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) కుమారుడు కిరీటి రెడ్డి(Kireeti Reddy) హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘జూనియర్(Junior)’. డైరెక్టర్ రాధాకృష్ణ(Director Radhakrishna) దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ యూత్ ఎంటర్‌టైనర్ ఈరోజు (జులై 18) తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో థియేటర్లలోకి వచ్చేసింది. యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా, బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా(Genelia), రవిచంద్రన్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం(DSP), కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలిచాయి. మరి జూనియర్ మెప్పించాడా? లేదా? ఓ లుక్కేద్దాం..
జూనియర్ కథేంటంటే..
కాలేజీ(College) నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒక రిలాక్స్డ్ యువకుడి కథే జూనియర్. కిరీటి రెడ్డి ఆకర్షణీయమైన కాలేజీ కుర్రాడిగా, శ్రీలీలతో ప్రేమ కథతో మెప్పిస్తాడు. ఫస్ట్ హాఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్(Commercial elements)తో సరదాగా సాగితే, సెకండ్ హాఫ్ ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకుంటుంది. జెనీలియా బాస్ పాత్రలో సర్‌ప్రైజ్ చేసింది. కిరీటి నటన, డ్యాన్స్‌లో ఆకట్టుకున్నాడు. ‘వైరల్ వయ్యారి(Viral Vayaari)’ పాటలో అతని స్టెప్స్, శ్రీలీల గ్రేస్ సోషల్ మీడియా(SM)లో వైరల్ అయ్యాయి. దేవిశ్రీ మ్యూజిక్, సెంథిల్ విజువల్స్ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. అయితే, కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ కమర్షియల్ ఫార్ములా ప్రేక్షకులకు మిశ్రమ స్పందన వస్తోంది.
కిరీటి ఎనర్జీ, డ్యాన్స్‌కు మంచి మార్కులు
ప్రీమియర్ షో(Premiere shows)ల తర్వాత సోషల్ మీడియా(SM)లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. కిరీటి ఎనర్జీ, డ్యాన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి, కానీ కథ రొటీన్‌గా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. మొత్తంగా యూత్‌ని ఆకర్షించే ఫన్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్(Emotional entertainer)గా ‘జూనియర్’ ప్రేక్షకులను నవ్విస్తుంది, కానీ కొత్తదనం కోరుకునే వారికి కాస్త నిరాశే మిగులుతుంది.
రేటింగ్: 2.5/5