గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి (Kireeti) హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’ (Junior). రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తెలుగు బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్. సీనియర్ నటి జెనీలియా (Genelia) కీలక పాత్ర పోషిస్తున్నారు. రావు రమేశ్, వైవా హర్ష తదితరులు నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ (Devi Sri Prsad) మ్యూజిక్ అందిస్తున్నారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్ అండ్ ఎంటర్టైనర్గా మూవీ రూపుదిద్దుకుంటోంది. జులై 18న విడుదల కానున్న టీజర్‌ని చిత్ర బృందం శుక్రవారం రిలీజ్ చేసింది. ఈ టీజర్‌ను మీరూ చూసేయండి.






