Suhas: సింగర్​ అవతారమెత్తిన హీరో సుహాస్​.. అదరగొట్టేశాడుగా!

యంగ్​ హీరో సుహాస్​ సింగర్​ అవతారమెత్తాడు. సినిమాలో పాటపాడి హోరెత్తించారు. దీంతో సినిమాల్లో పాటలు పాడిన నటుల జాబితాలో సుహాస్‌ (Suhas) కూడా చేరాడు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama). ఈ సినిమాలో ‘గల్లీ స్టెప్‌’ (Gully Step) అనే సాంగ్‌ పాడాడు సుహాస్‌. ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటకు రథన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందుకు సంబంధించిన లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. రామ్‌ గోదాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మాలవికా మనోజ్ హీరోయిన్​ (Malavika Manoj). ఉదయ్​కిరణ్​ ‘నువ్వు నేను’ చిత్ర హీరోయిన్​ ‘అనిత’ చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన లిరికల్​ వీడియోను మూవీ చూసేయండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *