బెల్లంకొండ, అనుపమల హారర్ మూవీ ‘కిష్కింధపూరి’.. రిలీజ్ డేట్ ఫిక్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(BellamKonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్(Anupama Paramwshwaran) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపూరి’(Kishkindhapuri)హారర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన కథ, థ్రిల్లింగ్ ట్రీట్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమా టీమ్ సిద్ధమవుతోంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘ఉండిపోవే నాతోనే’ అనే మొదటి సింగిల్ మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇది ఫీల్-గుడ్ లవ్ సాంగ్‌గా, బెల్లంకొండ అనుపమల మధ్య ఉన్న అందమైన కెమిస్ట్రీని చూపిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది.

సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఒక పాత భయానక బంగ్లా నేపథ్యంలో సాగే కథపై మంచి కుతూహలాన్ని రేకెత్తించింది. టీజర్‌లో హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌ మేళవింపుతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త, పవర్‌ఫుల్ లుక్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీని చిన్మయ్ సలాస్కర్ అందించగా, సామ్ సి.ఎస్. సంగీతాన్ని సమకూర్చారు. ఎడిటింగ్‌ను నిరంజన్ దేవరమానే నిర్వహిస్తున్నారు.

‘రాక్షసుడు’ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వస్తున్నందున ‘కిష్కింధపూరి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. హారర్, థ్రిల్, రొమాన్స్ మేళవింపుతో తెరకెక్కుతున్న ‘కిష్కింధపూరి’ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్(release date locked) కానుంది. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *