ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా(Team India) ప్లేయర్లు ఫామ్‌లోకి వస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్(England Lions)తో జరిగిన తొలి అనధికార టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (204) సూపర్ డబుల్ సెంచరీతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్ (92), ధ్రువ్ జురెల్ (94) రన్స్‌తో మెరిశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (64), అభిమన్యు ఈశ్వరన్ (68), ధ్రువ్ జురెల్ (53), నితీశ్ కుమార్ రెడ్డి (52) అర్ధశతకాలతో మెరిశారు. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ 3, శార్దూల్ 2 వికెట్లతో రాణించారు.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి..
తాజాగా అదే జట్టుతో జరుగుతోన్న రెండో అనధికార టెస్టులో భారత బ్యాటర్లు(Indian batters) చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 319/7 స్కోరు అందించారు. KL రాహుల్ (116) సెంచరీతో చెలరేగాడు. కరుణ్ నాయర్ (40), ధ్రువ్ జురెల్ (52), నితీశ్ (34) రన్స్ చేశారు. కాగా సెంచరీతో చెలరేగిన రాహుల్ ఇంగ్లండ్ సిరీస్(England series)లో ఓపెనర్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్(Rohit Sharma’s retirement)తో ఆ స్థానం కాగా.. విరాట్ కోహ్లీ(Virat Kohli) వీడ్కోలుతో నంబర్ 4 స్థానంలో వేకెన్సీ ఉంది. కాగా ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు ఈ నెల 20న లీడ్స్(Leads) వేదికగా ప్రారంభం కానుంది. ఇందుకోసం భారత్ నిన్న లండన్(London) చేరుకున్న విషయం తెలిసిందే.
THE CLASS OF KL RAHUL 🔥
KL Rahul is the most important batsman for Team India . #INDAvsENGApic.twitter.com/mntd45BKaK
— CricTalkWith – Atif 🏏 (@cricatif) June 7, 2025






