Venky: మరోసారి బిగ్ స్క్రీన్‌లో రవితేజ ‘వెంకీ’.. రీరిలీజ్ ఎప్పుడంటే?

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘వెంకీ(Venky)’ ఒకటి. శ్రీను వైట్ల(Srinu vaitla) దర్శకత్వం వహించిన ఈ మూవీని అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు. ఇందులో స్నేహ(Sneha) హీరోయిన్‌గా నటించగా.. అశుతోష్ రాణా, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్ తదితరులు ప్రధాన పాత్రలో నటించాడు. 2004లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తింది.

ఇప్పటికే రెండుసార్లు రీరిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా భారీ బిజినెస్ చేసింది. దీంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ నెల 14న మరోసారి బిగ్ స్క్రీన్‌పై ఆడియన్స్‌ కోసం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ రివీల్ చేయగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ట్రైన్లో సీన్లలో వచ్చిన కామెడీ, వెంకీ మాస్ యాక్టింగ్‌ను మళ్లీ తెరమీద చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *