KKR vs GT: ఈడెన్‌లో నెగ్గేదెవరు.. టాస్ నెగ్గిన కేకేఆర్

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు 39వ మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ నెగ్గిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. మోయిన్ అలీ స్థానంలో గుర్బాజ్ జట్టులోకి వచ్చాడు. అటు గుజరాత్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే ఆడుతోంది. హోం గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని కేకేఆర్ భావిస్తోంది.

టాప్‌లో GT.. ఏడో స్థానంలో KKR

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు 4 మ్యాచ్‌లలో తలపడ్డాయి. కోల్‌కతా ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే, గుజరాత్ రెండింట్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈడెన్ గార్డెన్స్‌లో ఒకే ఒక్క మ్యాచ్ జరగ్గా అందులోనూ గుజరాతే విజయం సాధించింది. ఇక GT ఆల్‌రౌండర్ షోతో ఆకట్టుకుంటోంది. కెప్టెన్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌తో విజయాలు సాధించింది. 7 మ్యాచ్‌లు ఆడిన GT 5 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇక ఈ సీజన్‌లో 7మ్యాచ్‌లు ఆడిన KKR మూడింటిలో గెలిచి, 4 ఓడింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

తుది జట్లు ఇవే..

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (C), జోస్ బట్లర్ (Wk), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్(Wk), సునీల్ నరైన్, అజింక్యా రహానే(C), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *