ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబోలో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో అట్లీ ఈ సినిమా కాస్టింగ్ పై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సెకండ్ హీరోగా ఓ కోలీవుడ్ నటుడిగా నటించనున్నట్లు సమాచారం.
సెకండ్ లీడ్ గా కోలీవుడ్ హీరో
ఈ సినిమా కథ డిమాండ్ మేరకు ఇందులో సెకండ్ లీడ్ హీరో ఉండాలని అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం డైరెక్టర్.. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan)ను సంప్రదించినట్లు సమాచారం. దీనికి ఎస్కేఎన్ కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. శివకార్తికేయన్ ప్రస్తుతం ‘పరాశక్తి (Parasakthi)’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.
ఐదుగురు హీరోయిన్లు
ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇందులో మెయిన్ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కనిపించనున్నట్లు తెలిసింది. ఇందులో హాలీవుడ్ హీరోయిన్లు సందడి చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం కోసం బన్నీ ఇటీవల ఫారిన్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ భారీ బడ్జెట్ సినిమాకు కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.






