ఏపీలో రాజకీయాల్లో సంచలన నిర్ణయం వెలువడింది. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. జనసేన(Janasena) ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు(Konidela Nagababu) పేరును ఖరారు చేస్తే ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు నామినేషన్(Nomination) దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయన నామినేషన్‌కు సంబంధించి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని జనసేన పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ @NagaBabuOffl గారి పేరు ఖరారు
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు… pic.twitter.com/B4yBXjG96X
— JanaSena Party (@JanaSenaParty) March 5, 2025
ఈనెల 20న పోలింగ్
కాగా ఏపీలో 5 MLA కోటా MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తికానుంది. ఈనెల 20న పోలింగ్(Polling) జరగనుంది. అదేరోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. కూటమి పొత్తులో భాగంగా ఓ MLC స్థానాన్ని జనసేన(Jenasena)కు కేటాయించారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన్ను మంత్రివర్గం(Cabinate)లోకి తీసుకొనే అవకాశం ఉంది.






