హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ (Formula E Race Case) వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో ఏసీబీ (KTR ACB Case) విచారణకు హాజరుకానున్నారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి ఆయన బయల్దేరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆయన్ను గృహ నిర్బంధం చేశారు.
ఏసీబీ విచారణ వేళ కేటీఆర్ పోస్టు
ఏసీబీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ (KTR Tweet Today) ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడమే ఎజెండాగా ఫార్ములా ఈ రేస్‌ను తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్, తయారీ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
న్యాయమే గెలుస్తుంది
ఫార్ములా ఈ రేసు నిర్వహణతో ఈ-మొబిలిటీ వీక్ ద్వారా రూ.12వేల కోట్ల పెట్టబడులు ఆకర్షించగలిగామని కేటీఆర్ పేర్కొన్నారు. నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదని అన్నారు. కానీ.. విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ విజన్, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారన్న మాజీ మంత్రి.. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని పేర్కొన్నారు.
Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globally
Agenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI
— KTR (@KTRBRS) January 9, 2025







