ManaEnadu: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్‌ను అరెస్ట్(Arrest) చేస్తారనే ప్రచారం జరగడంతో ఆ పార్టీ శ్రేణులు అర్ధరాత్రి ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు కేటీఆర్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఉదయం వరకూ KTR ఇంటి దగ్గరే నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అయితే ఆయన అరెస్ట్ ఖాయమన్న వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫార్ములా-ఈ కార్ రేస్(Formula-E car race), ఫోన్ ట్యాపింగ్(phone tapping) కేసుల్లో మాజీ మంత్రి KTR జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే పట్నం నోట కేటీఆర్ మాట
ఇదిలా ఉండగా ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్ల(Lagacharla)లో కలెక్టర్ మీద దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Former MLA Patnam Narendra Reddy) వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టు(Remand Report)లో పేర్కొన్నారు. విచారణ క్రమంలో కేటీఆర్ పాత్ర గురించి ఆయన చెప్పినట్లు అందులో వెల్లడించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న KTR ఆదేశాల మేరకే ప్రధాన నిందితుడు సురేశ్‌ను పురమాయించినట్లు పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అరెస్టు(KTR Arrest)కు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు: KTR
మరోవైపు తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసని KTR (X)లో ట్వీట్ చేశారు. ‘రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? 9నెలలుగా రైతులను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? రూ.50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?
నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?
నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?
నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి,…
— KTR (@KTRBRS) November 14, 2024






