హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula E Race Case) వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు ఏసీబీ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తన న్యాయవాదులతో వెళ్లిన ఆయనకు షాక్ తగిలింది. కేటీఆర్ లీగల్ టీమ్ (KTR Legal Team)కు అనుమతి లేదంటూ గేటు వద్దే పోలీసులు కారును నిలిపివేశారు.
లీగల్ టీమ్ తో రావొద్దని నోటీసుల్లో లేదు
లాయర్లను కారులో నుంచి బయట దింపిన తర్వాతే లోనికి రావాలని చెప్పారు. లీగల్ టీమ్ ఉంటే అభ్యంతరంఏంటంటూ కేటీఆర్ (KTR ACB Case) ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని, పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే తన లీగల్ టీమ్ తో వచ్చానని స్పష్టం చేశారు. లీగల్ టీమ్ తో రావొద్దని నోటీసుల్లో పేర్కొనలేదని.. తమ వద్ద ఉంటే చూపించాలని పోలీసులను డిమాండ్ చేశారు కేటీఆర్. తన తరఫు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా-ఈ కేసు విచారణ కోసం నంది నగర్ నివాసం నుండి బయలుదేరి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బంజారాహిల్స్ ఏసిబి కార్యాలయం ముందు కేటీఆర్ గారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ గారి… pic.twitter.com/2ggzaWprkY
— BRS Party (@BRSparty) January 6, 2025
రైతు భరోసా డైవర్ట్ చేసేందుకే
రైతు భరోసా అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకే ఏసీబీ కేసు డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ అన్నారు. తనను ఏసీబీ ఆఫీసుకు పిలిచి.. తన ఇంటిపై రైడ్స్ చేయించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ నోటీసులపై స్పందిస్తూ.. రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అందులో ఆయన తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌కు బయలుదేరి వెళ్లారు.
ఏసీబీ కార్యాలయం వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని అడ్డుకున్న పోలీసులు
✳️మీడియాతో కేటీఆర్ కామెంట్స్:
✳️చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చాను.
✳️కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ప్రవర్తిస్తుంది.… pic.twitter.com/LFtFNTLvnm
— BRS Party (@BRSparty) January 6, 2025







