భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ లో ఇవాళ (శనివారం) పర్యటించనున్నారు. ఈ పర్యటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చురకలు అంటించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ ప్రాంతాలను చూస్తే బాగుంటుందని ఎక్స్ వేదికగా కొన్ని ప్రాంతాల పేర్లను సూచించారు. #CongressFailedTelangana హ్యాష్‌ట్యాగ్ జోడించారు. ఆ ప్రాంతాలు ఏంటంటే..?
Dear @RahulGandhi Ji,
Since you are on a tour to Telangana, please visit the following places:
– Lagacharla village
– Sunkishala
– Any Hydra demolition site
– Musi Demolition site
– HCU Kancha Gachibowli
– Any of the families of the 100 Gurukul students who died… https://t.co/W16Uqg10jF— KTR (@KTRBRS) April 26, 2025
- లగచర్ల గ్రామం
- సుంకిశాల
- హైడ్రా కూల్చేసిన ఏ ప్రాంతమైనా
- మూసీ కూల్చివేసిన ప్రాంతాలు
- హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి
- ఫుడ్ పాయిజన్‌తో చనిపోయిన 100 మంది గురుకుల విద్యార్థుల కుటుంబాల్లో ఏదైనా
- ఆత్మహత్య చేసుకున్న 500కి పైగా రైతు కుటుంబాల్లో ఏదైనా
- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ప్రాంతం
- ఫోర్త్ సిటీ (ఫోర్ బ్రదర్ సిటీ)
- అశోక్ నగర్( అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిన ప్రాంతానికి)
ఈ ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా మీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రాష్ట్రానికి చేసిన నష్టాన్ని మరింత బాగా తెలుసుకోవడానికి మీకు అద్భుతమైన సమయం లభిస్తుందని ఆశిస్తున్నానని రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కుదరకపోతే ఈడీ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలంగాణ రెవెన్యూ మంత్రిని అడిగి తెలుసుకుంటే బాగుంటుందంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.






