బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను రేవంత్ సర్కార్ నట్టేట ముంచిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కోతలు, కటాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు.
హామీలు తుంగలో తొక్కారు
రుణమాఫీ, రైతు భరోసా, సాగునీళ్లు, కరెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మి రూ. 2500, ఆసరా పెన్షన్లు, రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల పించను, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇలా అన్ని హామీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.
కటింగులు, కటాఫ్ లు మినహా
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమిటి ?రుణమాఫీ కటింగ్
రైతుభరోసా కటింగ్
సాగునీళ్లు కటింగ్
కరంటు కటింగ్
కేసీఆర్ కిట్ కటింగ్న్యూట్రిషన్ కిట్ కటింగ్
తులంబంగారం కటింగ్
మహాలక్ష్మి రూ.2500 కటింగ్
ఫించను రూ.4000 వేలు కటింగ్
రూ.5 లక్షల… pic.twitter.com/lw2oWggRKw
— KTR (@KTRBRS) January 20, 2025
ఆ హామీలన్నీ ఏమయ్యాయి?
రైతులకు రూ. 3 లక్షల వడ్డీ లేని రుణం, భూమి లేని రైతులకు రైతు బీమా, నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం, ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు హామీలన్నీ మరిచిపోయారని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఎందుకు ఈ కటింగులు?
50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పింఛను ఇస్తామన్న మాట మరిచారని, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలకు రేవంత్ రెడ్డి సర్కార్ కటింగ్ పెట్టిందని ఫైర్ అయ్యారు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ కటాఫ్, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, ఆఖరుకు ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్, పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు కటాఫ్ ఎందుకు..? అని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరని నిలదీశారు.







