టాలీవుడ్‌లో “పెళ్లి సందడి” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల( Sreeleela), తన అందం, అభినయంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తొలి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించగా.. ఆ తర్వాత రవితేజ సరసన నటించిన “ధమాకా” సినిమా శ్రీలీలకు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా ఆమె స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది.
అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. “భగవంత్ కేసరి”లో నటించినా, ఆ సినిమా హిట్ క్రెడిట్ బాలకృష్ణ ఖాతాలో పడింది. అలాగే మహేష్ బాబు “గుంటూరు కారం”లో నటించిన శ్రీలీలకు విమర్శలే ఎదురయ్యాయి. తాజాగా నితిన్ హీరోగా వచ్చిన “రాబిన్ హుడ్” కూడా అభిమానులను నిరాశ పరిచింది.
శ్రీలీల టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లోనూ కొత్త ప్రాజెక్టులు సైన్ చేస్తోంది. హిట్స్ పరంగా వరుస విజయం లేకపోయినా, ట్రెండింగ్ హీరోయిన్‌గా మాత్రం శ్రీలీల నిలబడుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో “ఉస్తాద్ భగత్ సింగ్”లో నటిస్తున్న శ్రీలీల, అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న “లెనిన్” (Lenin)సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో “వినరో భాగ్యము విష్ణు కథ” చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన, ఇప్పుడు ఈ సినిమాతో అఖిల్‌ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇంతలో ఈ ప్రాజెక్టులో శ్రీలీలను తప్పించారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తైనప్పటికీ, శ్రీలీల డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల మేకర్స్ ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించినట్టు సమాచారం. మేకర్స్ ఆమె కోసం షూటింగ్‌ను వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ పరిస్థితులు మార్చుకోకపోవడంతో ఆమెను రీప్లేస్ చేయాలని నిర్ణయించారట.
ప్రస్తుతం “లెనిన్” కోసం కొత్త హీరోయిన్ కోసం సెర్చ్ మొదలైనట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అక్కినేని అభిమానులు, సినిమాపై ఆసక్తిగా ఉన్న ప్రేక్షకులు దీనిపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.






