కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ 21వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్(LSG) విక్టరీ సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో లక్నో 12 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటర్లు బ్యాటర్లు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. లక్నోకు ఓపెనర్లు మార్క్‌క్రమ్, మిచెల్ మార్ష్ ఏకంగా 99 పరుగుల భాగస్వామ్యం అందించారు. వేగంగా ఆడే క్రమంలో మార్క్‌క్రమ్ (28 బంతుల్లో 47) పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
పూరన్, మార్ష్ తుఫాన్ ఇన్నింగ్స్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (36 బంతుల్లో 87) రన్స్, మార్ష్ (41 బంతుల్లో 81) పరుగులతో విధ్వంసం సృష్టించారు. వరుస బౌండరీలతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మార్ష్ తుఫాన్ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరి విధ్వంసంతో లక్నో 238/3 భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2 వికెట్లు తీయగా, ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఛేదనలో వారిద్దరే..
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నైట్‌రైడర్స్ ధాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు డికాక్ (15), నరైన్ (30) రన్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత కెప్టెన్ రహానే (35 బంతుల్లో 61), వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45) చెలరేగినా వీరికి మిగతా బ్యాటర్ల సహకారం దక్కలేదు. చివర్లో రింకూ సింగ్ (15 బంతుల్లో 38) రన్స్‌తో మెరుపులు మెరిపించినా నిర్ణీత ఓవర్లలో 234/7 పరుగులకే పరిమితమైంది. దీంతో లక్నో 4 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ చెరో 2 వికెట్లు తీయగా, అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
🚨 MATCH SUMMARY 🚨
Image- @JioHotstar
#IPL2025 #IPL #KKRvsLSG #KKRvLSG #LSGvsKKR #LSGvKKR #KKR #TATAIPL #TATAIPL2025 pic.twitter.com/aQC5rJRnUR— KolkataKnightRiders (@KKR_FanClub) April 8, 2025






