పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఎ.దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఎ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే.
మాట వినాలి ఎలా పాడారంటే?
‘మాట వినాలి (Maata Vinali BTS Video)’ అంటూ సాగే ఈ పాటను స్వయంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడారు. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్ తో ఈ సినిమా యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది. కీరవాణి మ్యూజిక్ అందించగా ఈ పాటకు సంబంధించి బీటీఎస్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట రికార్డింగ్, మేకింగ్ ఎలా చేశారో ఈ వీడియోలో చూడొచ్చు. మరి మీరూ ఈ వీడియోను ఓసారి చూసేయండి.
సింగర్ పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ గతంలోనూ పలుమార్లు తన సినిమాల్లో పాటలు పాడిన విషయం తెలిసిందే. జానీ (Johnny Movie) సినిమాలో నువ్వు సారా తాగుట మానురన్నో, ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కాటమరాయుడా కదిరి నరసింహుడా, ‘అజ్ఞాతవాసి’లో కొడకా కోటేశ్వరరావు అంటూ పవర్ స్టార్ గొంతెత్తారు. ఈ పాటలు ఆ సినిమాలకే హైలైట్ గా నిలిచాయి. ఇక తాజాగా ‘హరిహర వీరమల్లు’లోనూ మాట వినాలి అంటూ పవన్ పాట పాడారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది.






