టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే మరింత ఎక్కువగా నవ్వులు పూయించింది. మొదటి పార్ట్‌లో నటించిన నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ఈ సినిమాలోనూ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు.
Mamulgane veelatho MAD mad untadhi, inka laddu pelli ante MAD MAXX ey 😎🔥
Watch Mad Square, now on Netflix in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#MadSquareOnNetflix pic.twitter.com/35PvMZpKpT— Netflix India South (@Netflix_INSouth) April 25, 2025
మ్యాడ్ స్క్వేర్ అప్డేట్
మార్చి 28వ తేదీన థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా (MAD Square Release Date) సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ మూవీని థియేటర్లోల చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేసారు. ఈ చిత్రం రిలీజ్ అయిన సమయంలో చెప్పుకోదగ్గ చిత్రాలు లేకపోవడంతో మళ్లీ మళ్లీ చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక థియేటర్ల నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ చూడాలనుకున్న వారు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్
ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ న్యూస్ ను తాజాగా షేర్ చేసుకున్నారు. మ్యాడ్ స్క్వేర్ మూవీ (MAD Square Ott News) ఓటీటీలోకి వచ్చేసిందని తెలిపారు. ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో ప్రస్తుతం ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ ను జాలీగా మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి.






