MadSquare OTT: ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ డేట్ లాక్!

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్(Mad Square)’. ‘మ్యాడ్‌’ (Mad)’ చిత్రానికి సీక్వెల్‌గా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Director Kalyan Shankar) తెరకెక్కించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 28న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తోపాటు కలెక్షన్లలోనూ దూసుపోతోంది. ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్(Success Meet) కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది.

కేవలం తెలుగులోనే స్ట్రీమింగ్

ఇక ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ మూవీ ఏప్రిల్ 25 నుంచే స్ట్రీమింగ్ కానుందని టాక్. అయితే పాన్ ఇండియా భాషల్లో కాకుండా కేవలం తెలుగులోనే ఈ చిత్రం రానున్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా అది అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *