మహారాష్ట్ర శాసనసభలో (Maharashtra Assembly) జరిగిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మహా వికాస్ అఘాఢీ (MVA) కూటమి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలదు. అధికారం చేపడుతున్న మహాయుతి (Mahayuti) కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (EVM) తారుమారు చేశారని ఆరోపించారు.
మూడు రోజులపాటు సమావేశాలు
288 మంది సభ్యులున్న మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబ్కర్ పర్యవేక్షణలో మూడు రోజులపాటు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ సెషన్‌లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, కొత్త ప్రభుత్వానికి విశ్వాస ఓటు, గవర్నర్ ప్రసంగం ఉంటాయి.
ఈ ఫలితాలు ప్రజల ఆదేశం కాదు.. ఎన్నికల సంఘం తీర్పు
శనివారం సమావేశానికి హాజరైన ఎంవీఏ ఎమ్మెల్యేలు.. వాకౌట్ చేసి అసెంబ్లీ వద్ద ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర తమ నిరసన వ్యక్తం చేశారు. ‘వీఎంల వినియోగంతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మేము బహిష్కరిస్తున్నాం’ అన్నారు. భారత ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆదేశం కాదు, ఇది ఈవీఎం, భారత ఎన్నికల సంఘం ఆదేశం’ (election commission of india) అని ఉద్ధవ్ ఠాక్రే (uddhav thackeray) అన్నారు.
సీఎం ఫడణవీస్
మహారాష్ట్రలో నవంబర్ 20న జరిగిన ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గంతో కూడిన మహాయుతి కూటమి 230 స్థానాలు గెలుచుకుంది. సీఎం ఎవరనే విషయంపై తర్జనభర్జనల నడుమ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు.
🚨 DRAMA starts in Maharashtra🚨
Mumbai: Shiv Sena (UBT) & MVA MLA 🤔
Opposition MVA members will not take oath as MLAs on Day 1 of assembly session to protest misuse of EVMs, says Aaditya Thackeray.Aaditya Thackeray says, "Today, we have decided that our Shiv Sena (UBT)… pic.twitter.com/VzNjBTvS3z
— Manu (@Jenni15011) December 7, 2024






