భారతీయ పౌరాణిక కథల ఆధారంగా తెరకెక్కిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహా(Mahavatar Narasimha) బాక్సాఫీస్ వద్ద మంచి హవా కొనసాగిస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ వస్తోంది. అలాంటి కేటగిరీలోనే ఉంది మహా అవతార్ నరసింహ. ఈ సినిమాలో బిగ్ స్క్రీన్ పై నరసింహుడి ఉగ్రరూపం చూసి పూనకాలెత్తిపోతున్నారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్‌ఇండియా హిట్‌లను అందించిన హోంబలే ఫిలిమ్స్(Hombale Films)) తాజా ప్రయత్నంగా ఈ సినిమాను ప్రెజెంట్ చేసింది.
సినిమా విడుదలైన వెంటనే ఓటిటి ప్లాట్‌ఫారమ్‌పై స్ట్రీమింగ్( streaming date) ఎప్పుడు మొదలవుతుందనే ఆసక్తి మొదలైంది. ఇప్పుడు ఆడియన్స్ దృష్టి OTT విడుదలపై పడింది. OTT రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద ప్రసారం కానుంది.
ఈ చిత్రం 2025 జూలై 25న థియేటర్లలో విడుదల అయింది. సాధారణంగా, సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 వారాల (దాదాపు 60 రోజులు) తర్వాత ఓటిటి(OTT) ప్లాట్‌ఫారమ్ లో వస్తుండటంతో, ఈ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఓటిటీలోకి వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ ఈ సినిమాను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, చిత్ర నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానులు ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూడాల్సిందే.






