Ram Charan: రామ్ చరణ్ పెద్ది ఐటెం సాంగ్.. స్టార్ హీరోయిన్‌తో కత్తి లాంటి ప్లాన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) అభిమానులకు గుడ్ న్యూస్.. ఆయన తాజా చిత్రం ‘పెద్ది'(Peddi)కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ ఫోక్ సాంగ్ ఉండబోతుందని, దీనిలో రామ్ చరణ్‌తో కలిసి స్టార్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు వేయబోతున్నారని తెలుస్తోంది.

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యం, రగ్గడ్ మాస్ లుక్‌లో రామ్ చరణ్ ఉండడం ఈ అంచనాలను మరింత పెంచాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఒక స్పెషల్ ఫోక్ సాంగ్‌ను రీమిక్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట “మా ఊరి ప్రెసిడెంట్” అనే పాపులర్ జానపద గీతాన్ని ఆధారం చేసుకుని రూపొందుతుందని, దీనికి మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్ తనదైన టచ్ ఇవ్వబోతున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి గ్లామర్ బ్యూటీ శ్రీలీల డ్యాన్స్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ‘పుష్ప 2’ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అదే ఫాంలో రామ్ చరణ్ సరసన శ్రీలీల కనిపించనుందని తెలుస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కానుంది. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ మెగా ఫ్యాన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *