సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajmouli) కాంబోలో ఓ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. తరచూ ఈ చిత్రం గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. కానీ చిత్రబృందం మాత్రం ఎప్పుడూ ఆ రూమర్లపై స్పందించలేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో పూజ
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీమ్ నుంచి అభిమానులకు కొత్త ఏడాది వేళ ఓ శుభవార్త వినిపించింది. ఇవాళ జనవరి 2వ తేదీన ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. SSMB29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సంబంధించిన పూజా కార్యక్రమం గురువారం నిర్వహించనున్నట్లు తెలిసింది.
మహేశ్ బాబు వస్తారా
అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమం (SSMB29 Pooja Ceremony) నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతిస్తారా? లేదా? అన్న దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు మహేశ్ బాబు సాధారణంగా తన సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు. ఈ చిత్రానికి కూడా ఇదే సెంటిమెంట్ పాటిస్తారా? లేదా? అన్నది చూడాలి.
జనవరి చివరి వారంలో షూటింగ్
నిధి వేట నేపథ్యంలో సాగే అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమార్ నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనవరి చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మాదిరిగా పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.






