90’s వెబ్ సిరీస్ దర్శకుడితో.. ‘బేబీ’ కాంబో మరో సినిమా

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya) కాంబోలో వచ్చిన ‘బేబీ (Baby)’ సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోవర్ధన మారుతీ, ఎస్‍కేఎన్ నిర్మించిన ఈ చిత్రం..  రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది.

ఆదిత్య హాసన్ తో బేబీ కాంబో

ఇక ఈ సినిమాలో ఆనంద్ (Anand Devarakonda), వైష్ణవి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ జంట మరోసారి కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినీ లవర్స్ కు గుడ్ న్యూస్. ఈ హిట్ పెయిర్ మరో హిట్ కొట్టేందుకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈటీవీ విన్ లో గతేడాది రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ కొట్టిన ‘#90 (90’s Middle Class)’ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ వైష్ణవి, ఆనంద్ రెండో సినిమాకు దర్శకత్వం వహించనున్నారట.

ఓ రెండు మేఘాలిలా

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నాగవంశీ నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రానికి ‘ఓ రెండు మేఘాలిలా (O Rendu Meghalila)’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలిసింది. బేబీ సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ పాట లిరిక్ ను ఈ జంట నటిస్తున్న రెండో సినిమా టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు రావడంతో ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడం పక్కా అంటున్నారు నెటిజన్లు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *