ప్రస్తుతం చాలా మంది యువత వెబ్ సిరీస్లు చూసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అందులోనూ విదేశీ సిరీస్ లను ఎక్కువ లైక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొరియన్ వెబ్ సిరీస్ (Korean Web Series), సినిమాలు చూసేందుకు యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొరియన్ వెబ్ సీరీస్ లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game-1). ఈ సిరీస్ సీజన్-1 సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న స్క్విడ్ గేమ్-2
ఇక ఇటీవలే స్క్విడ్ గేమ్-2 (Squid Game-2) కూడా రిలీజ్ అయింది. అయితే సీజన్ -1 కంటే సీజన్-2 అంతగా కిక్ ఇవ్వలేదనే టాక్ షురూ అయింది. స్క్విడ్ గేమ్-2పై భారీగా అంచనాలు ఎక్కువగా ఉండటం వల్లే ఇలాంటి టాక్ వచ్చిందని కొందరు అంటున్నారు. అయితే ఈ సీజన్ చూసిన వ్యూవర్స్ లెక్క చూస్తుంటే మాత్రం అలా కనిపించడం లేదు. నెట్ ఫ్లిక్స్ లో భారీ వ్యూస్ తో ఈ సిరీస్ ఇప్పుడు టాప్ లో దూసుకెళ్తుంది.
సీజన్-3లో హాలీవుడ్ హీరో
మరోవైపు సీజన్-2 చివరలో సీజన్-3 కూడా ఉంటుందనే హింట్ ఇచ్చారు మేకర్స్. సీజన్-1 తర్వాత పార్ట్-2 రావడానికి మూడేళ్లు పట్టింది. ఇక ఇప్పుడు సీజన్-3 (Squid Game 3)కి మరెన్నేళ్లు పడుతుందోనని నెటిజన్లు అనుకుంటున్నారు. కానీ స్క్విడ్ గేమ్-3 ఈ ఏడాది జూన్ లోనే రిలీజ్ చేయనున్నట్లు ఇప్పుడు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఈ సీజన్లో హాలీవుడ్ స్టార్, టైటానిక్ మూవీ ఫేం లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio) భాగం కానున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సినీ లవర్స్ కు ఇక పండగే.
YOUNG-HEE & CHUL-SU
Squid Game Season 3. Coming 2025. pic.twitter.com/x5UfR1GxT8
— Netflix (@netflix) December 31, 2024






