
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) హీరోగా.. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కీలకపాత్రలో నటించిన చిత్రం కుబేర(Kubera). స్మార్ట్ అండ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) డైరెక్ట్ చేసిన ఈ మూవీ రేపు (జూన్ 20) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి సునీల్ నారంగ్(Sunil Narang) నిర్మాత. కుబేర మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే USలో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఈ మూవీని ఉద్దేశించి సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) ఎక్స్(X) వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.
#Kuberaa looks promising with everything that has come out so far….. Wishing the entire team all the very best for the release tomorrow…🤗🤗👍🏻👍🏻@AsianSuniel @iamnagarjuna @dhanushkraja@iamRashmika @jimSarbh @sekharkammula @ThisIsDSP pic.twitter.com/Ag0Hm3uTu0
— Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2025
కుబేర మూవీ కాస్త డిఫరెంటుగా కనిపిస్తోంది: ప్రిన్స్
‘‘శేఖర్ కమ్ముల-నాగార్జున-ధనుష్ కాంబినేషన్‌లో వస్తోన్న కుబేర మూవీ టీమ్(Kubera Movie Team)కి ఆల్ ది బెస్ట్. ఇప్పటివరకు వచ్చిన సినిమాలంటే కుబేర మూవీ కాస్త డిఫరెంటుగా కనిపిస్తోంది. రేపు విడుదల కానున్న ఈ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’’ అని మహేశ్ ట్వీట్(Tweet)లో రాసుకొచ్చారు. కాగా మహేశ్ ట్వీట్‌కు నాగార్జున, ధనుష్ ఇద్దరూ స్పందించారు. ‘థాంక్యూ సో మచ్.. మీ విషెస్ మా చిత్రాన్ని మరింత స్పెషల్(Special) చేశాయి. కోట్లాది మందికి చేరువ చేశాయి’ అని కృతజ్ఞతలు చెబుతూ రీట్వీట్స్ పెట్టారు.
ఇదిలా ఉండగా ఈ మూవీకి ఏపీ ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో టికెట్ల ధరలు(Ticket Rates) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. పదిరోజుల పాటు పెంచిన ధరలు అమలు చేసుకోవచ్చిన తెలిపింది. కాగా తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.
RRR range ticket hike for Kubera
75rs hike for 10 days
Ap tg business musti 30 cr
Mari over ga leda miku @kanduladurgesh @PawanKalyan pic.twitter.com/xZHelP3BAr— . (@Suryateja_23) June 19, 2025