మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR)కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashant Neel) పవర్ ఏంటో కూడా పెద్దగా ఇంట్రడ్యూస్ చేయనవసరం లేదు. అలాంటి వీరిద్దరి కాంబోలో NTR-Neel పేరుతో ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతోన్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఓ షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఎన్టీఆర్ లేకుండానే తొలి విడత షూటింగ్
ఈ మేరకు NTR-Neel మూవీకి సంబంధించి మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ రివీల్ చేయనున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 9 మధ్యాహ్నం 12.06 గంటలకు ఈ సర్‌ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అసలు ఈ సర్‌ప్రైజింగ్ అప్డేట్ ఏమై ఉంటుందా అని సినీవర్గాలతోపాటు అభిమానులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ లేకుండానే తొలి విడత షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. కాగా ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్
మరోవైపు మూవీపై అభిమానుల్లో ఉన్న భారీ అంచాలను తగినట్లే.. మూవీ షూటింగ్ కూడా ఓ భారీ స్థాయి యాక్షన్ సీన్‌తో మొదలు పెట్టారు. ఇందుకు ఏకంగా 3 వేలకుపైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు(NTR Arts Banners) సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారీ పాన్ ఇండియా(Pan India) చిత్రం జనవరి 9, 2026లో విడుదల కానుంది. ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటంతో అభిమానులతో అంచనాలు అమాంతం పెరిగాయి.
#NTRNeel Update Tomorrow 12:06 PM #JrNTR #PrashanthNeel pic.twitter.com/gJPWFZwX0q
— Filmy Focus (@FilmyFocus) April 8, 2025






