
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్(CSK)తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్(PBKS) 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 219/6 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో సూపర్ కింగ్స్ ఓవర్లన్నీ ఆడి 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో పంజాబ్ 18 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. చివరి ఓవర్లో 28 పరుగులు అవసరం కాగా ధోనీ(Dhoni) క్రీజులో ఉండటంతో చెన్నై ఆశలు పెట్టుకుంది. కానీ చివరి ఓవర్లో ఇంపాక్ట్ బౌలర్‌గా వచ్చిన యశ్ ఠాకూర్(Yash Thakur) తొలి బంతికే ధోనీని అవుట్ చేయడంతో పంజాబ్ విజయం ఖరారైంది. పైగా అద్భుతంగా బౌలింగ్ చేసిన యశ్ ఆ ఓవర్లో 9 రన్స్ మాత్రమే ఇచ్చి పంజాబ్‌కు విజయాన్నందించాడు.
కుర్రాడు కుమ్మేశాడు..
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ ఇన్నింగ్స్ అంత ఘనంగా ఏం ప్రారంభం కాలేదు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ రెండు బంతులు ఎదుర్కొని డౌకట్ కాగా.. మరో ఎండ్‌లో యంగ్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య (42 బంతుల్లో 103) సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత శ్రేయస్, స్టొయినిస్, వధేరా, మ్యాక్స్ వెల్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో శశాంక్ సింగ్ (52) హాఫ్ సెంచరీకితోడు జాన్సెన్ (34) రన్స్‌తో మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు. జడేజా, ముకేశ్ చెరో వికెట్ పడగొట్టారు.
🚨 Indian Premier League 2025, CSK vs PBKS 🚨
PLAYER OF THE MATCH
Priyansh Arya#PBKSvsCSK #PBKSvCSK #CSKvsPBKS #CSKvPBKS #IPL2025 #TATAIPL2025 #TATAIPL #Mullanpur #Chandigarh #WhistlePodu #விசில்போடு #Yellove #PunjabKings #SherSquad #PriyanshArya📸@IPL pic.twitter.com/ubYUxoyrUq
— Sporcaster (@Sporcaster) April 8, 2025
చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చెన్నైకి ఓపెనర్లు రచిన్ (36), కాన్వే (69) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో రచిన్ ఔటుకాగా, వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ (1) నిరాశపర్చాడు. ఆతర్వాత శివమ్ దూబే (42), ధోనీ (27) చెలరేగడంతో చెన్నై విజయంపై ఆశలు పెట్టుకుంది. కానీ దూబే ఔటవ్వడం, ఆ తర్వాత కాన్వే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ రెండు, యశ్ ఠాకూర్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు. సెంచరీ హీరో ప్రియాన్ష్ ఆర్యకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. కాగా ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది మూడో విజయం కాగా, చెన్నైకి నాలుగో ఓటమి.
PBKS win! Priyansh Arya’s century and Shashank Singh’s late hitting were the difference! CSK fall short by 18 runs. #PBKSvCSK #IPL2025 #CSKvsPBKS pic.twitter.com/u03sN41GOG
— Sourav Khanna (@SouravKhanna1) April 8, 2025