
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్(Rerelease trend) నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షలను ఆకట్టుకున్న సినిమాలు తాజాగా మళ్లీ 4K వెర్షన్‌లో థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో అప్పుడు థియేటర్లలో సినిమాలను అభిమానులు ఈ సినిమాలకు క్యూ కడుతున్నారు. ఇక ఈ మధ్య కన్నప్ప (Kannappa జూన్ 27), తమ్ముడు (Thammudu జులై 4) మినహా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో పెద్ద ఎత్తున రీరిలీజ్‌లకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో లవ్(Love), రొమాన్స్, మాస్, ఎమోషన్, యాక్షన్(Action) అనే అన్ని ఎలిమెంట్లు కలిగిన ఆరు సినిమాలు రీ-ఎంట్రీకి రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలేవో ఓ లుక్ వేద్దామా..
హనుమాన్ జంక్షన్
2001లో వచ్చిన మల్టీస్టారర్ డ్రామా ‘హనుమాన్ జంక్షన్(Hanuman Junction)’ ప్రేక్షకులను తెగ నవ్వించింది. అర్జున్(Arjun), జగపతిబాబు, వేణు కలిసి స్క్రీన్‌పై చేసిన సందడి అంతా ఇంతా కాదు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జూన్ 28న మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.
కుమారి 21ఎఫ్
రాజ్ తరుణ్(Raj Tarun), హెబా పటేల్ కాంబినేషన్‌లో 2015లో వచ్చిన ఈ చిత్రం కుమారి 21ఎఫ్(Kumari 21F). జులై 10న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది స్వేచ్ఛ, అపోహల మధ్య ప్రేమ ఎలా మారుతుందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అప్పట్లో కుర్రకారును ఈ మూవీ తెగ ఆకట్టుకుంది. యువతను ఆలోచింపజేసే ఈ ప్రేమ కథ సుకుమార్ రచనలో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చింది.
మిరపకాయ్
మాస్ మహారాజ రవితేజ(Raviteja) అభిమానులకు అదిరిపోయే న్యూస్. 2011లో వచ్చిన “మిరపకాయ్(Mirapakay)” మూవీ జులై 11న మళ్లీ రిలీజ్ అవుతోంది. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో మాస్ మహారాజా మళ్లీ ఈ సినిమాలో నటించిన తీరు ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి తమన్(Thaman) అందించిన మ్యూజిక్ మరో హైలైట్‌గా నిలిచింది.
గజిని
2005లో సూర్య(Suriya) కెరీర్‌లో ఓ ఆల్ టైమ్ హై యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచిన చిత్రం గజిని(Gajini). మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జులై 18న తెలుగు ప్రేక్షకులను మరోసారి థ్రిల్ చేయనుంది. ఈ మూవీలో సూర్య యాక్టింగ్ మరోరేంజ్‌లో ఉంటుంది. ఇక ఆసిన్ రోల్ కీలకం. సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి.
ఏ మాయ చేశావే
సమంత(Samantha), నాగ చైతన్య(Naga Chaitanya) జంటగా 2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏ మాయ చేశావే(Ye Maaya Chesave). ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతోనే చై, సామ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని చెబుతుంటారు. అయితే ఇప్పుడీ సినిమా మళ్లీ జులై 18న విడుదలకు సిద్ధమవుతోంది.
వీడొక్కడే
సూర్య(Suriya), తమన్నా(Thamannah) జంటగా 2009లో తెరకెక్కిన సినిమా వీడొక్కడే(Veedokkade). ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. ‘ఆయాన్(Ayaan)’ మూవీకి ఇది తెలుగు వెర్షన్. సైంటిఫిక్ స్మగ్లింగ్ కథాంశంతో కూడిన ఈ చిత్రం రీ-రిలీజ్‌తో ఫ్యాన్స్‌ను మళ్లీ థ్రిల్ చేయనుంది. ఈ మూవీ జులై 19, 2025న సూర్య 50వ పుట్టినరోజు సందర్భంగా 4K వెర్షన్‌లో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.