విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సూర్య(Suriya). డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్(Special Fanbase)ను సంపాదించుకున్నాడు. తాజాగా సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కంగువా(Kanguva)’. తన తొలి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకులను అలరించాలని అనుకున్న సూర్య ఈసారి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 14న రిలీజ్ అయిన కంగువా బాక్సాఫీస్(Boxoffice) వద్ద బోల్తా కొట్టింది. మూవీ రివ్యూలు(Reviews) సైతం ఓ మోస్తరుగా ఉన్నాయి. అయితే కంగువా విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja) ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదని, అంత కంటెంట్ ఉందని ధీమాగా చెప్పారు. కానీ తీరా చూస్తే డిజాస్టర్ టాక్‌తో పల్టీ కొట్టింది.
నెగటీవ్ ఫీడ్‌బ్యాక్‌పై నిర్మాత స్పందన
అయితే ఇదంతా ఒకటి రెండు రోజులకు పరిమితమని మెల్లగా తమ సినిమా అంచనాలకు మించి ఆడుతుందనే ధీమా వ్యక్తం చేశారు నిర్మాత రాజా. మొదటి రోజు స్పందనతో పాటు నెగటీవ్ ఫీడ్‌బ్యాక్(Nagative Feedback)పై ఆయన తాజాగా మాట్లాడారు. కంగువా 2(Kanguva-2) సెకండ్ పార్ట్ ఇంకా భారీ రేంజ్‌లో క్రూరంగా తీస్తాం. కాకపోతే దీనికన్నా ముందు దర్శకుడు శివ అజిత్(Ajith)తో ఒక సినిమా చేసి, ఆ తర్వాత సీక్వెల్ పనులు మొదలుపెడతామని చెప్పారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పై స్పందిస్తూ ఇందులో దేవిశ్రీ ప్రసాద్(DSP) తప్పేమి లేదని, సౌండ్ మిక్సింగ్(Sound Mixinng)లో జరిగిన పొరపాట్ల వల్ల లౌడ్ నెస్ ఎక్కువైందన్నారు. సెకండ్ షో నుంచి రెండు పాయింట్ల వాల్యూమ్ తగ్గించేలా డిస్ట్రిబ్యూటర్ల(Distributors)కు సూచనలు చేశామని అన్నారు.
భారీ స్థాయిలో రిలీజ్ అయినా..
అయితే కంగువాను అర్థం చేసుకోవడానికి, ఫైనల్ రిజల్ట్స్ తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. కానీ తమిళంలో ఎలా ఆడినా తెలుగులో మాత్రం కంగువాకు ఎదురీత తప్పేలా లేదు. పొన్నియిన్ సెల్వన్ ఒరిజినల్ వెర్షన్ అద్భుతాలు చేసినా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడాయి. కాగా తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని సిరుత్తై శివ(Shiva) డైరెక్ట్ చేయగా.. స్టూడియో గ్రీన్ కేఈ జ్ఞానవేల్ రాజా(KE Gnanavel Raja), యువీ క్రియేషన్స్ (UV Creations) సంయుక్తంగా నిర్మించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యాక్టర్స్ బాబీ డియోల్(Bobby Deol), దిశా పటానీ(Disha Patani) ప్రధాన పాత్రల్లో నటించారు.






